‘‘మానవ ప్రపంచ ప్రగతి సాధనాలలో భౌతికనాగరికత ఒకటి; అయినప్పటికీ దివ్యనాగరికతతో అది మమేకం కానంతవరకూ, ఆశించిన ఫలితం, అనగా జనసంక్షేమం సాధ్యం కాదని బహాఉల్లా బోధనలు చెబుతున్నాయి. . . ’’
— అబ్దుల్-బహా
బహాఉల్లా నవీన ప్రపంచదార్శనికతతో స్ఫూర్తిని పొందినవారు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ కూడా సౌభాగ్యవంతమైన చైతన్యతర సమాజాల నిర్మాణకార్యక్రమాలలో, అభ్యసనాలలో నిమగ్నులై ఉన్నారు. అలాంటి సమాజాలను నిర్మించడానికిగాను, వాటిని నిర్మించే వ్యక్తుల, వ్యవస్థల, సమాజాల సామర్ధ్యం, పరిపక్వతల పరంగా అసాధారణమైన పెరుగుదల అవసర మౌతుంది. ప్రస్తుతం, భారతదేశవ్యాప్తంగా బహాయి సమాజాలలో, అలాంటి సామర్ధ్యాలను ఆరాధన-సేవ అనబడే ఇరుసుచుట్టూ పరిభ్రమించే కార్యక్రమాలద్వారా, అభ్యసనాలద్వారా ప్రోత్సహించడం జరుగుతున్నది.
వాటిలోపాల్గొనేవారు: బహాయి బోధనలను గురించి తమ అవగాహనలను సాటివారితో పంచుకోవడం, సమిష్టి ఆరాధనకు వేదికలను కల్పించుకోవడం, యువతను సశక్తీకరించడం, భగవద్వచనాన్ని అధ్యయనంచేసి, ప్రపంచశ్రేయస్సుకు దానిని అనువర్తింప చేయడంలో మిత్రబృందాలకు తోడ్పడడం ద్వారా - ఆరాధనాకార్యక్రమాలూ, ప్రజాక్షేమానికి సహకరించే యత్నాలూ పరస్పరం అనుసంధానితాలై ఉన్న – సమాజనిర్మాణ ప్రక్రియకు తోడ్పాటును అందిస్తారు.